- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్య రాముడు ఇదిగో.. మరో ఫోటో వైరల్
అయోధ్య రామమందిరం గర్భగుడిలో కొలువుదీరనున్న రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహానికి సంబంధించిన ఫోటోలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: అయోధ్య రామమందిరం గర్భగుడిలో కొలువుదీరనున్న రామ్ లల్లా (బాల రాముడి) విగ్రహానికి సంబంధించిన ఫోటోలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గర్భగుడిలోని పీఠంపై బాలరాముడి విగ్రహాన్ని గురువారం ప్రతిష్టించగా ఈ విగ్రహానికి సంబంధించిన ఫోటోలు మీడియాలో వచ్చాయి. నల్లరాతితో 51 అంగులాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహంపై భాగాన్ని తెల్లని వస్త్రంతో కప్పి ఉంచారు. అయితే ఇవాళ ఆ తెల్లటి వస్త్రం స్థానంలో కేవలం కళ్లకు గంతలు మాత్రమే కట్టి ఉన్న విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. ప్రాణప్రతిష్ట వరకు బాల రాముడి కళ్లకు గంతలు అలాగే కట్టి ఉంటాయని అక్కడి అర్చకులు చెబుతున్నారు. ఈనెల 22వ తేదీన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా బాలరాముడి కళ్లకు ఉన్న గంతలను ప్రధాని నరేంద్ర మోడీ విప్పి భగవంతుని దర్శనం చేసుకుంటారు. కాగా బాల రాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.






