- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయోధ్యలో ముగ్గురు అనుమానితుల అరెస్టు..!
అయోధ్య రామాలయ ప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా.. వందల మంది ప్రముఖులు హాజరుకానున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్య రామాలయ ప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా.. వందల మంది ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో ఆలయ ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేసింది యూపీ ప్రభుత్వం. అయోధ్య సమీపంలో ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకీ తీసుకున్నారు ఏటీఎస్ పోలీసులు.
అయోధ్య జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత చేపట్టినట్లు యూపీ శాంతి భద్రతల డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముగ్గురు అనుమానితుల్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆ ముగ్గురూ ఏ సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉందన్నారు. అయోధ్య వ్యాప్తంగా సీసీ కెమెరాలు, నైట్ విజన్ కెమరాలతో భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నిత్యం డ్రోన్ల ద్వారా అయోధ్య పరిసరాలను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు డీజీపీ.
వారణాసికి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ అనే పూజారి రాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువును నిర్వహించనున్నారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి 51 అంగుళాలతో రాముడి విగ్రహాన్ని తయారుచేశారు. ఇప్పటికే ఆలయ గర్బగుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు.






