- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Womens Day 2025: కారు నడపడం మగవాళ్ల సొత్తేమీ కాదు.. మహిళలు ఎక్కువగా కొనే కార్లు ఇవే!
Womens Day 2025: మహిళలు (Womens)అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: Womens Day 2025: మహిళలు (Womens)అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. పురుషులతో పోటీ పడుతున్నారు. ప్రపంచాన్నే జయిస్తున్నారు. అన్నింటిలోనూ తాము ముందున్నాం అంటూ నిరూపిస్తున్నారు. సైకిల్ నుంచి అంతరిక్షం వరకు మహిళామణులదే ప్రపంచం. గత కొన్నేళ్లుగా భారత్ లో మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం దిశగా గణనీయమైన పురోగతిని సాధిస్తున్నారు. ఈ రంగం..ఆ రంగమని కాదు అన్ని రంగాల్లోనూ మహిళలదే పైచేయి. ఆటోమొబైల్ రంగం(Automobile sector)లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ లో వాహనాలు కొంటున్న మహిళల(Womens Day 2025) సంఖ్య క్రమంగా పెరుగుతోందని స్పిన్నీ(Spinney) ఇటీవల విడుదల చేసిన ఓ నివేదికలో స్పష్టమైంది.
ఈ రిపోర్టు ప్రకారం 2023లో 16శాతం ఉన్న మహిళల కస్టమర్ల (Womens Day 2025) సంఖ్య 2024 నాటికి 26శాతానికి చేరింది. మార్చి 2025 నాటికి ఈ సంఖ్య కాస్త 46శాతానికి చేరుకుంది. కొనుగోలు ధోరణులు, సామాజిక నిబంధనల్లో మార్పును ప్రదర్శిస్తుంది. ఈ ట్రెండ్ మహిళలు కార్లు నడపడమే కాదు పరిశ్రమలో మార్పునకు నాంది పలుకుతున్న కొత్త శకాన్ని కూడా సూచిస్తుంది.
అయితే మహిళా కొనుగోలుదారుల ప్రాధాన్యతలపై ఫోకస్ పెట్టింది స్పిన్నీ రిపోర్టు(Spinney Report). 60శాతం మంది ఆటోమేటిక్ హ్యాచ్ బ్యాక్(Automatic hatchback) ల వైపు ఇట్రెస్ట్ చూపిస్తున్నారు. కాంపాక్ట్ ఎస్ యూవీ(Compact SUV)లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. 18శాతం మంది మహిళలు వీటినే ఎంచుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న కార్ల జాబితాలో రెనాల్ట్ క్విడ్(Renault KWID), హ్యుందాయ్ గ్రాండ్ ఐ10(Hyundai Grand i10), మారుతీ సుజుకీ స్విఫ్ట్(Maruti Suzuki Swift) కార్లు టాప్ లో నిలిచాయి.
కార్లు కొనుగోలు చేసే మహిళల సంఖ్య ఢిల్లీ ఎన్సీఆర్(Delhi NCR) లో ఎక్కువగా ఉంది. 48శాతం మంది మహిళా కస్టమర్లు ఈ ప్రాంతాల నుంచే ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో ముంబై 46శాతం, బెంగళూరు 41 శాతం మంది మహిళలు ఉండగా..పుణెలో ఈ సంఖ్య 39శాతం ఉంది. ఇక లక్నో, జైపూర్ లలో కూడా ఈ సంఖ్య 20శాతం పెరిగింది. కార్లు కొనుగోలు చేసే మహిళల సగటు వయస్సు 30 నుంచి 40ఏళ్ల మధ్య ఉంది. మహిళలు వారి జీవనశైలికి సపోర్టు ఇచ్చే విధంగా ఆటోమోటివ్ విషయంలో ఇండివిడ్యూవల్ ఆప్షన్స్(Individual options) ఎంచుకుంటున్నారని సూచిస్తుంది.






