- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒక్కరోజులోనే రూ.1910 పెరిగిన బంగారం ధర..తులం ఎంతంటే?
by Ajay Maddhiboyina |
ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా పెరిగిపోయింది. మళ్లీ నేడు బంగారం ధర రూ. 98 వేలకు చేరుకుంది. నిన్న బంగారం ముగింపు ధర రూ. 96,540గా ఉంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఒక్కరోజులోనే బంగారం ధర భారీగా పెరిగిపోయింది. మళ్లీ నేడు బంగారం ధర రూ. 98 వేలకు చేరుకుంది. నిన్న బంగారం ముగింపు ధర రూ. 96,540గా ఉంది. ఇక ఒక్కరోజులోనే దేశరాజధానిలో బంగారం ధర రూ.1910 లు పెరిగి 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.98,450కి చేరుకుంది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో సాయంతం సమయానికి తులం బంగారం ధర రూ.98వేలకు పైనే ఉంది. అమెరికా కరెన్సీ డాలర్ విలువ బలహీన పడటంతో బంగారం డిమాండ్ పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వెండి ధరలు సైతం భారీగా పెరిగాయి. నిన్న కిలో వెండి ధర రూ.97,500గా ఉండగా నేడు కిలో వెండి ధర రూ.99,160కి చేరుకుంది. దీంతో ఒక్కరోజులోనే వెండి రూ.1660 పెరిగింది. ఇక ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఇది మగువలకు కచ్చితంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
Next Story






