- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Budget Cars: కొత్త కారు కొనే ప్లాన్ లో ఉన్నారా?.. రూ. 10లక్షల్లో టాప్ మోడల్స్ ఇవే.!
Budget Cars: కొత్త కారు కొనాలని అందరికీ ఉంటుంది.

దిశ,వెబ్ డెస్క్: Budget Cars: కొత్త కారు కొనాలని అందరికీ ఉంటుంది. కానీ ముందుగా ఆలోచించేది బెస్ట్ బడ్జెట్, టాఫ్ ఫీచర్లు, మార్కెట్లో అడ్వాన్స్డ్ ఆప్షన్స్ తో అందుబాటు ధరలో ఉండే ఆప్షన్లను చూస్తుంటారు. మీరు కూడా రూ. 10లక్షల లోపు బడ్జెట్ లో కొత్త కారు కొనాలని ఆలోచిస్తుంటే ప్రస్తుతం మార్కెట్లోకి చాలా మంచి కార్లు లాంచ్ కాబోతున్నాయి. కొద్ది రోజులు వేచి చూడటం మంచిది. ఎందుకంటే బడ్జెట్ సెగ్మెంట్లో కొన్ని అద్భుతమైన కొత్త కార్లు త్వరలోనే లాంచ్ కాబోతున్నాయి. ముఖ్యంగా 2025లో నాలుగు మోడల్స్ రూ. 10లక్షలలోపు ధరల్లో రావచ్చు. ఇవి అప్ డేటేడ్ డిజైన్లు, ఎక్స్‌ట్రా ఫీచర్లు, ప్రాక్టికల్ ఫర్మార్మెన్స్ తో రాబోతున్నాయి.
నిస్సాన్ కాంపాక్ట్ ఎంపీవీ:
నిస్సాన్ సంస్థ రెనాల్ట్ ట్రైబర్ ఆధారంగా సరికొత్త ఎంపీవీని డెవలప్ చేస్తోంది. ఇది 2025 దీపావళి సమయంలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ట్రైబర్ ఫ్లాట్ ఫామ్ , 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తోనే వచ్చినా డిజైన్ మాత్రం చాలా భిన్నంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్ ఇందులో ఉంది. 8 అంగుళాల టచ్ స్క్రీన్, 7 అంగుళాల డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్ లెస్ ఛార్జింగ్, 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. ధర సుమారు రూ. 6లక్షల నుంచి రూ .9లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
టాటా ఆల్ట్రోజ్ ఫేస్ లిస్ట్
టాటా మోటార్స్ అప్ డేటేడ్ ఆల్ట్రోజ్ హ్యాచ్ బ్యాక్ ను లాంచే చేసేందుకు రెడీ అవుతోంది. మరికొద్ది నెలల్లోనే మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫేస్ లిస్ట్ ఆల్ట్రోజ్ లో డిజైన్ లో చిన్న చిన్న మార్పులు, కొన్ని ఎక్స్ ట్రా ఫీచర్లు ఉంటాయి. ఇంజన్ ఆప్షన్స్ సేమ్ ఇప్పటి వెర్షన్ వలే 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ గా ఉంటాయి. ధర సుమారు రూ. 7లక్షల నుంచి రూ. 11. 50లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
రెనాల్ట్ కైగర్ ఫేస్ లిస్ట్
రెనాల్ట్ కైగర్ ఫేస్ లిస్ట్ డిజైన్ పరంగా అప్ డేట్ అవుతోంది. రానున్న కొన్ని నెలల్లోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో అవే పాత ఇంజిన్లు 1.0లీటర్ నేచరుల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఉంటాయి. బయటి డిజైన్ లో చిన్న మార్పులే చేసినా..క్యాబిన్ లోపల కొత్త టెక్ ఫీచర్లత్ో అప్ గ్రేడ్ కానుంది. ధర సుమారు రూ.6లక్షల నుంచి రూ. 10లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది.
హ్యుందాయ్ వెన్యూ:
హ్యుందాయ్ తన నెక్ట్స్ జనరేషన్ వెన్యూను 2025 పండగ సీజన్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త మోడల్ తన సిగ్నేచర్ బాక్సీ డిజైన్ ను కంటిన్యూ చేస్తోంది. కానీ మరింత మోడర్న్ లుక్, అప్ గ్రేడెడ్ ఇంటీరియర్స్ తో వస్తుంది. ఇంజిన్ లో ప్రస్తుత లైనప్ 1.2 లీటర్ ఎంపీఐ పెట్రోల్ 10 లీటర్ టర్భో పెట్రోల్ 1.5 లీటర్ డిజిల్ కంటిన్యూ అవుతాయి. ధర సుమారు 8లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.






