Safe Driving Tips in Summer: ఎండలు మండుతున్నాయి.. కారు డ్రైవ్ చేసే వాళ్ళకి కీలక టిప్స్

by Vennela |

Safe Driving Tips in Summer: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి.

Safe Driving Tips in Summer: ఎండలు మండుతున్నాయి.. కారు డ్రైవ్ చేసే వాళ్ళకి కీలక టిప్స్
X

దిశ,వెబ్‌డెస్క్: Safe Driving Tips in Summer: వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. వేసవికాలంలో లాంగ్ డ్రైవ్ చేసే వాహనదారులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పలు రకాల ప్రమాదాలు ఎదురవుతాయి. అందుకే వేసవిలో డ్రైవింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం.

టైర్లు: టైర్లలో గాలి సరిపడా ఉండే విధంగా చెక్ చేసుకోవాలి. కనీసం నెలకోసారి దీన్ని చెక్ చేసుకోవాలి. టైరుపై గరిష్ట ఒత్తిడి అనేది ఉంటుంది. ఆ లెక్కన అస్సలు గాలినికొట్టించకూడదు. అంతకంటే కొంచెం తక్కువ గాలినే టైర్లలోకి కొట్టిస్తేనే మంచిది. అన్ని టైర్లపై ప్రతీ అంగుళానికి కనీసం 2/32ట్రెడ్ ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని వాహన కంపెనీలు ఆరేళ్లకోసారి టైర్లను మార్పిడి చేస్తుంటాయి. కదలడానికి తక్కువ శక్తిని వినియోగించే టైర్లలోని ట్రెడ్ జీవిత కాలం తక్కువగా ఉంటుంది. వాహనంలో తప్పకుండా అదనపు టైరు జాక్ కిట్ ఉంచుకోవాలి.

ఆయిల్ లెవల్స్ :

ఏ రకమైన వాహనమైనా సరే ఎప్పటికప్పుడు ఆయిల్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. సకాలంలో ఆయిల్స్ మార్పించాలి. బ్రేక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, పవర్ స్టీరింగ్, విండ్ షీల్డ్ వాషర్ లకు సంబంధించిన ఆయిల్స్ ను సకాలంలో మార్పించాలి. లాంగ్ డ్రైవ్ కు బయలుదేరే ముందు ఇవన్నీ ఫుల్ చేయించాలి.

ఎయిర్ కండీషనింగ్:

సమ్మర్ లో వాహనంలో ఏసీ వినియోగం తప్పనిసరి. లాంగ్ డ్రైవ్ కు ముందు ఏసీ పనితీరును ఒకటికి, రెండు సార్లు చెక్ చేసుకోవాలి. వాహన కేబిన్ లో ఎయిర్ ఫిల్టర్ ను చెక్ చేయాలి. రోగులు, పిల్లలు, వ్రుద్ధులు సమ్మర్ టైంలో ఏసీ లేని కారులో ప్రయాణిస్తే ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంటుంది. వడ దెబ్బ బారిపడే ప్రమాదం కూడా ఉంటుంది.

బ్యాటరీలు, లైట్లు

వాహనంలోని బ్యాటరీ కండీషన్ లో ఉండాలి. అవసరమైతే రిపేర్లు చేయించుకోవాలి. మీకు ఒకవేళ హైబ్రిడ్ ఎలక్రిక్ వాహనం ఉంటే ట్యాంకులో పెట్రోల్, డీజిల్ స్టాక్ చేసుకోవాలి. వాహనం హెడ్ లైట్స్, బ్రేక్ లైట్స్, టర్న్ సిగ్నల్స్, ఎమర్జెన్సీ ఫ్లాషర్లు, ఇంటీరియర్ లైట్లు చెక్ చేసుకోవాలి.

సీటు బెల్టులు

కారులో అత్యంత కీలకమైంది సీటు బెల్టు. వాహనంలో కూర్చొనే వారంతా తప్పనిసరిగా సీటు బెల్టును ధరించాలి. అందరూ సరిగ్గా దీన్ని పెట్టుకున్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వాహనంలో పలు రబ్బరు బెల్టులు, గొట్టాలు ఉంటాయి. వేసవిలో భారీ ఉష్ణోగ్రతలకు అవి నాణ్యతను కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి వాటన్నింటిని చెక్ చేయించి దెబ్బతిన్న వాటి స్థానంలో కొత్తవి వేయించుకోవాలి.

Next Story