- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Royal Enfield: రయ్ రయ్ అని దూసుకుపోయే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్.. 650ccలో ఏది బెస్ట్?
Royal Enfield: ఇటీవలే ఐషర్ యాజమాన్యంలోని రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసికల్ 650 మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్: Royal Enfield: ఇటీవలే ఐషర్ యాజమాన్యంలోని రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసికల్ 650 మోటార్ సైకిల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ క్రూయిజర్ మోటార్ సైకిల్ ధర రూ. 3.37లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇది 243కిలోల బరువుతో ప్రస్తుతం రిటైల్ కు అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో అత్యంత బరువైన మోడల్ గా అవతరించింది. ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసికల్ 650 బైక్ 650 సీసీ లైనప్ లో చేర్చింది. ఇందులో సూపర్ మెటియోర్ 650, బేర్ 650, షాట్ గన్ 650, ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వంటి మోడల్స్ ఉన్నాయి. ఈ క్లాసికల్ 650 మోడల్ ను రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ 650 ఆధారంగా రూపొందించారు.
ఇవి రెండూ ఒకే 649సీసీ సమాంతర ట్విన్ ఇంజిన్ ను కలిగి ఉంటాయి. అయితే ఈ రెండు మోటార్ సైకిళ్లు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. సూపర్ మీటియర్ 650 హైవేలో ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుంది. అయితే క్లాసికల్ 650 రోజువారీ ఉపయోగం, తక్కువ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ఫీల్డ్ కు చెందిన ఈ రెండు మోటార్ సైకిళ్ల కంపారిజన్ చూద్దాం.
ధర
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసికల్ 650 ధర రూ. 3.37 లక్షల నుంచి ప్రారంభమై రూ. 3.50లక్షల వరకు ఉంది. సూపర్ మీటియోర్ 650 ధర అయితే రూ. 3.64 నుంచి ప్రారంభమై రూ. 3.94లక్షల వరకు ఉంది. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే.
డిజైన్
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసికల్ 650 బైక్, క్లాసికల్ 350 మోడల్ మాదిరిగా రెట్రో డిజైన్ ను కలిగి ఉంది. ఇది టియర్ డ్రాప్ ఫ్యూయెల్ ట్యాంక్, వంపుతిరిగిన ఫెండర్స్ , క్రోమ్ ట్విన్ ఎగ్జాస్ట్ లు, అనేక షేడ్స్ లో కనిపించే డిజైన్ ఫీచర్లను కలిగి ఉంది.
అదే సమయంలో సూపర్ మెటియోర్ 650 మోడల్ ఫార్వర్డ్ మౌంటెడ్ ఫుట్ పెగ్స్ , స్కూప్డ్ సీట్, స్వీఫ్డ్ హ్యాండిల్ బార్స్ ను కలిగి ఉంది. అంతేకాదు ఈ బైక్ పెద్ద, మరింత రిలాక్స్డ్ సీటింగ్ పొజిషన్ ను అందిస్తుంది. ఇది సుదీర్ఘ హైవే ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. ఈ రెండు బైకులు వాటి వేరియంట్స్ ను బట్టి వేర్వేరు షేడ్స్ కలిగి ఉన్నాయి. క్లాసికల్ 650 మోడల్ హాట్ రాడ్, క్లాసికల్ క్రోమ్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. అయితే సూపర్ మీటియర్ 650 ఆస్ట్రల్, ఇంటర్ స్టెల్లార్, సెలెస్టియల్ అనే మూడు వేరియంట్స్ లో వస్తుంది.






