భారత్‌లో ప్రారంభమైన IPHONE 17 అమ్మకాలు.. ఆఫర్లు, డిస్కౌంట్స్ వివరాలు ఇవే

by Ajay Maddhiboyina |

యాపిల్ (Apple mobile) లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న IPHONE 17 అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. ముంబైలో ఐఫోన్ 17 కోసం స్టోర్స్ ముందు కొనుగోలు దారులు ఉదయం నుండి క్యూ కట్టారు. ఢిల్లీ,పూణేలోనూ కస్టమర్లు స్టోర్ల ముందు క్యూలో నిలుచున్నారు.

భారత్‌లో ప్రారంభమైన IPHONE 17 అమ్మకాలు.. ఆఫర్లు, డిస్కౌంట్స్ వివరాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: యాపిల్ (Apple mobile) లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న IPHONE 17 అమ్మకాలు భారత్‌లో ప్రారంభమయ్యాయి. ముంబైలో ఐఫోన్ 17 కోసం స్టోర్స్ ముందు కొనుగోలు దారులు ఉదయం నుండి క్యూ కట్టారు. ఢిల్లీ,పూణేలోనూ కస్టమర్లు స్టోర్ల ముందు క్యూలో నిలుచున్నారు. అయితే ఈ మోడల్స్ కాస్త తక్కువ ధరకు కొనుగోలు చేయాలని అనుకునేవారు, ఆఫర్స్ లో తీసుకోవాలని అనుకునేవాళ్లు మాత్రం అప్పుడే తొందరపడకుండా వెయిట్ చేస్తున్నారు. ఐఫోన్ 17పై స్టోర్స్, ఆన్ లైన్‌‌ స్టోర్స్ లో రకరకాల డిస్కౌంట్లు, ఆఫర్స్ ఉన్నాయి.

క్రోమా (croma) స్టోర్‌లో ఐఫోన్ 17 కొనుగోలుపై రూ.6వేల తక్షణ డిస్కౌంట్ ఉంది. అంతే కాకుండా క్రోమాలో ఆన్లైన్ ద్వారా లేదా స్టోర్‌లో కొనుగోలు చేసినా 6 నెలల పాటు ఈఎంఐ ద్వారా ఫైనాన్స్ పొందే అవకాశం కూడా ఉంది. దీంతో పాటు కస్టమర్లు రూ.12వేల వరకు ఎక్స్‌చేంజ్ బోనస్ పొందవచ్చు. విజయ్ సేల్స్ (vijay sales) ఆన్ లైన్, స్టోర్‌లో సైతం ఐఫోన్ 17 సిరీస్ పై డిస్కౌంట్స్ ఉన్నాయి.

ఐఫోన్ 17 వర్షన్ పై రూ.6వేల డిస్కౌంట్ లభిస్తుంది. 17 ప్రో లోని 2TB వేరియంట్‌ పై రూ.4వేల డిస్కౌంట్ ఉంది. రిలయన్స్ డిజిటల్ (relince digital) లో కూడా ఈ మోడల్ పై డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రత్యేక బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్ చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. ఐఫోన్ 17పై రూ.6వేల స్పాట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్ పై రూ.4వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇందులో ఎక్స్ చేంజ్ ఆఫర్ కింద రూ.7వేల వరకు డిస్కౌండ్ లభిస్తుంది.

Next Story