Grand Vitara: సుజుకీ నుంచి మరో అదిరే కార్‌ లాంచ్‌.. ధర కూడా రీజనబుల్‌.. ఫీచర్లు ఇవే

by Vennela |

Grand Vitara: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV గ్రాండ్ విటారా 2025 మోడల్‌ను విడుదల చేసింది.

Grand Vitara: సుజుకీ నుంచి మరో అదిరే కార్‌ లాంచ్‌.. ధర కూడా రీజనబుల్‌.. ఫీచర్లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: Grand Vitara: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన అత్యంత ప్రజాదరణ పొందిన SUV గ్రాండ్ విటారా 2025 మోడల్‌ను విడుదల చేసింది. ప్రారంభ ధర రూ. 11.42 లక్షలు. ఈ అప్ డేట్ వాహనంలో మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో కొత్త వేరియంట్స్ ఉన్నాయి. అన్ని వేరియంట్స్ లో ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగులు స్టాండర్డ్ గా ఉంటాయి. అదనంగా దీనిలో కొత్త డెల్టా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ను తీసుకువచ్చింది. దీని ధర రూ. 16.99 లక్షలుగా నిర్ణయించింది. కంపెనీ కొత్త డెల్టా ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్స్ ను కూడా లాంచ్ చేసింది. దీని ధర రూ. 16.99లక్షలు. ఈ కొత్త డెల్టా ప్లస్ వేరియంట్ ఇప్పుడు జీటా ప్లస్, ఆల్ఫా ప్లస్, వాటి ప్రత్యామ్నాయ ట్రిమ్స్ తో పాటు లభిస్తుంది. హైబ్రిడ్ మోడల్స్ పెట్రోల్ ఇంజిన్, లిథియం అయాన్ బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ మోటార్ కలయికను కలిగి ఉంటాయి.

ఈ కొత్త అప్డేట్ గ్రాండ్ విటారా అన్ని మోడాళ్లు ఇప్పుడు ఈ20 ఫ్యూయెల్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. దీని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లలో హిల్ హోల్డ్ అసిస్ట్ తో కూడిన ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఏబీఎస్ అండ్ ఈబీడీతో ఫ్రంట్ అంట్ రియర్ డిస్క్ బ్రేక్స్ ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, అన్ని సీట్లకు 3 పాయింట్ సీట్ బెల్టులను ఇచ్చింది.

ఇప్పుడు దీని ఇంటీరియర్ ఫీచర్లలో 8వే పవర్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 6ఏటీ వేరియంట్లలో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్,బ్యాక్ డోర్స్ కు సన్ షేడ్స్, ఎల్ఈడీ క్యాబిన్ ల్యాంప్స్, పీఎం 2.5 ఎయిర్ ఫ్యూరిఫైయర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. అంతేకాదు కంపెనీ ఈ అప్ డేటేడ్ గ్రాంట్ విటారా జీటా, ఆల్ఫా వేరియంట్లలో కొత్త ఆర్ 17 అల్లాయ్ వీల్స్, అదనపు సర్ రూఫ్ ఆప్షన్ ను అందిస్తుంది. ఈ ఎస్ యూవీ మూడు ఆప్షన్స్ లలో లభిస్తుంది. ఈ SUV వైర్‌లెస్ కనెక్టివిటీతో కూడిన 9-అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ప్లస్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా పొందుతుంది. ఇది మాత్రమే కాదు, హెడ్-అప్ డిస్ప్లే, 360 వ్యూ కెమెరా, వైర్‌లెస్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్, సుజుకి కనెక్ట్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉంటాయి.

2025 గ్రాండ్ విటారా ఇంజిన్‌లో ఎటువంటి మార్పు లేదు. కానీ ఇప్పుడు ఈ ఇంజిన్ E20 కంప్లైంట్ గా ఉంది. దీనికి 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. ఇది మైల్డ్ హైబ్రిడ్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎంపికలలో లభిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ 102bhp పవర్, 137Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో, బలమైన హైబ్రిడ్ ఇంజిన్ 113bhp శక్తిని, 122Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. 2025 గ్రాండ్ విటారా ధర రూ. 11 లక్షల 42 వేలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఇది కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, టాటా కర్వ్‌లకు పోటీగా ఉంటుంది.

Next Story