- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
EV Scooters: ఈవీ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో అదిరే ఆఫర్లు.. నేరుగా ఇంటికే డెలివరీ

దిశ, వెబ్ డెస్క్ : EV Scooters: ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈవీ(EV)లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సామాన్యుడు ఈవీలను కొనుగోలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు తమ ఈవీ స్కూటర్ల(EV Scooters)పై స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ ద్వారా కస్టమర్లకు అందుబాటులో ఉండేవిధంగా ఈ కామర్స్ సైట్స్ లోనూ కూడా అమ్మకాలు సాగిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్(Amazon) లో ప్రస్తుతం ఈవీ స్కూటర్లపై స్పెషల్ డిస్కౌంట్స్(Special Discounts)ను అందిస్తోంది. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
AMO కంపెనీకి చెందిన మరో ఈవీ స్కూటర్(EV Scooters) జాంటీ ఎల్ లీడ్ యాసిడ్(Jonty L Lead Acid) తక్కువ వేగంతోపాటు పోర్టబుల్ ఛార్జర్ తో లభిస్తుంది. ఈ స్కూటర్ లో యాంటీ థెప్ట్ అలారం తో ఈ స్కూటర్ పై దొంగల భయం ఉండదు. ఈ స్కూటర్ లో బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్(Bluetooth music system) కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపడం కూడా చాలా ఈజీ. ఈ స్కూటర్ మార్కెట్, ఆఫీస్ లేదా కాలేజీలకు వెళ్లేలా అంటే పట్టణ ప్రాంత ప్రజల ద్రుష్టిలో పెట్టుకుని లాంచ్ చేశారు. ఈ స్కూటర్ కేవలం రూ. 54,077కు మీరు కొనుగోలు చేయవచ్చు.
ఏఎంఓ(AMO) ఎలక్ట్రిక్ స్కూటర్ జాంటీ లిథియం బ్యాటరీ(Jaunty Lithium Battery)లో రన్ అవుతుంది.ఇది గ్రేకలర్ లో అందుబాటులో ఉంది. ఈ ఈవీలో పోర్టబుల్ ఛార్జర్ తోపాటు స్టైలిష్ ఎల్ఈడీ లైటర్లతో వస్తుంది. ఈ స్కూటర్ పై ప్రత్యేక ఈఎంఐ(EMI) ఆఫర్ ను కూడా కంపెనీ అందిస్తుంది. ఈ స్కూటర్ బ్యాటరీ పూర్తి ఛార్జ్ అయ్యేందుకు 3 నుంచి 4గంటల సమయం మాత్రమే పడుతుంది. ఈ స్కూటర్ ధర రూ. 74691కి కొనుగోలు చేయవచ్చు.
ఆంపియర్(Ampere) కంపెనీకి సంబంథించిన ఈవీ స్కూటర్ ఈఎక్స్ గెలాక్టిక్ అమెజాన్ లో రూ. 74,999కు అందుబాటులో ఉంది. గెలాక్సీ గ్రే కలర్(Galaxy Gray color) లో అందుబాటులో ఉండే ఈ స్కూటర్ లో మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 3ఏళ్ల వారంటీతో వస్తుంది. ఈ స్కూటర్ లో యూఎస్ బీ ఛార్జింగ్ పోర్టుతో పాటు స్టాండ్ సెన్సార్ కూడా ఆకట్టుకుంటుంది.
ఈఓఎక్స్ కంపెనీ(EOX Company)కి చెందిన ఈ-2 4జీ ఎలక్ట్రిక్ స్కూటర్ రెడ్ కలర్ లో అందుబాటులో ఉంటుంది. ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఈ స్కూటర్ ను నడపవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్(Budget-friendly design) తో కూడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజిటల్ డిస్ప్లే, యూఎస్ బీ ఛార్జింగ్ పోర్ట్, ట్యూబ్ లెస్ టైర్లు, బ్యాక్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వాటర్ ప్రూఫ్ BL డీసీ మోటార్ తో వస్తుంది. ఈ స్కూటర్ రూ. 47,998కు కొనుగోలు చేయవచ్చు.
ఈఓఎక్స్ ఈ2 ఎలక్ట్రిక్ స్కూటర్(EOX E2 Electric Scooter) ప్రస్తుతం అమెజాన్ లో రూ. 51,498 కు అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 నుంచి 80 కిలో మీటర్ల మైలేజీని ఇస్తుంది. ఈ స్కూటర్ వాటర్ ప్రూఫ్ మోటార్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ లో బ్లాక్, రెడ్ కాంబినేషన్ లో ఆకర్షిస్తుంది. ఆకట్టుకునే డిజైన్ తో ఈ స్కూటర్ మొబైల్ ఛార్జింగ్ కోసం యూఎస్ బీ పోర్ట్, హై రిజల్యూషన్ డిస్ల్పే(High resolution display) ఈ స్కూటర్ ప్రత్యేకతలుగా ఉన్నాయి.