- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కరోనా రికార్డు.. @985
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులోనే వందల సంఖ్యల్లో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజల్లో కలవరం రేపుతుంది. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తెలంగాణలో ఏకంగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 774 కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వైరస్ […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకీ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజులోనే వందల సంఖ్యల్లో కేసులు నమోదు కావడం రాష్ట్ర ప్రజల్లో కలవరం రేపుతుంది. శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తెలంగాణలో ఏకంగా 985 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 774 కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. వైరస్ కారణంగా శుక్రవారం 7గురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 237కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 12,349 కేసులు నమోదు కాగా.. ఇందులో 4,766 మంది డిశ్చార్జి అయ్యారు. ఈ రోజు ఒక్కరోజే 78 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 7436 యాక్టివ్ కేసులున్నాయి.
Next Story






