- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో 983 కొత్త కేసులు.. 11 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 983 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 67,660 కరోనా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి 551 మంది మృతిచెందారు. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 48,609 మంది బాధితుల్లో రికవరీ అయ్యారు. 18,500 మంది బాధితులు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 983 కొత్త కేసులు నమోదయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 67,660 కరోనా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సోకి 551 మంది మృతిచెందారు.
ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 48,609 మంది బాధితుల్లో రికవరీ అయ్యారు. 18,500 మంది బాధితులు ఇంకా చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 273 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 4,87,238 కరోనా టెస్టులు నిర్వహించారు.
Next Story






