- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో కరోనా @ 9,06,752
<p>దిశ, న్యూస్‌బ్యూరో: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. గడిచిన రెండు వారాల వ్యవధిలోనే 3లక్షల కొత్త కేసులు, 6వేల మరణాలు నమోదవడం వైరస్ వ్యాప్తి వేగం, దాని ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించేసరికి గడిచిన 24గంటల్లో దేశంలో 28,498 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 9,06,752కి చేరినట్లు […]</p>

దిశ, న్యూస్‌బ్యూరో: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 9లక్షలు దాటింది. గడిచిన రెండు వారాల వ్యవధిలోనే 3లక్షల కొత్త కేసులు, 6వేల మరణాలు నమోదవడం వైరస్ వ్యాప్తి వేగం, దాని ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మంగళవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్ వెల్లడించేసరికి గడిచిన 24గంటల్లో దేశంలో 28,498 కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 9,06,752కి చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ బారినపడి ఒక్కరోజే 553మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 23,727కు చేరింది. కరోనా సోకిన మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 5,71,460 మంది కోలుకోగా ప్రస్తుతం 3,11,565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఢిల్లీలో ఒక్కరోజే 1606 కొత్త కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,15,346కు చేరింది. ఇక్కడ కొత్తగా 35కరోనా మరణాలు నమోదవడంతో మొత్తం 3,446 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజులోనే 6,741 పాజిటివ్ కేసులు నమోదై మొత్తం కేసుల సంఖ్య 2,67,665కి వెళ్లింది. రాష్ట్రంలో 24గంటల్లో వైరస్ బారినపడి 213 మంది చనిపోగా మొత్తం మరణాలు 10,695కి చేరాయి. తమిళనాడులో 24 గంటల్లో 4, 526పాజిటివ్‌లు నమోదై మొత్తం కేసుల సంఖ్య 1,47,324కి చేరింది. ఇక్కడ కొత్తగా కరోనాతో 67మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 2,099కి చేరింది. గుజరాత్‌లో ఇప్పటివరకు ఉన్న 43,723 కేసులకు గాను 2,071 మంది మరణించడం రాష్ట్రంలో కలవరం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 1,916కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,019కి చేరింది. ఒక్కరోజే ఏపీలో కరోనాతో 43 మంది చనిపోయారు. ఇప్పటివరకు 408మంది మృత్యువాత పడ్డారు.






