ఆ 9 మంది 53 మందికి అంటించారు

by Vemula.Srinu Prasad |

<p>ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాను కరోనా కేసులు వణికిస్తున్నాయి. గుంటూరు పట్టణంతో పాటు రూరల్‌లో కూడా పోలీసులు పూర్తి స్థాయి కర్ఫ్కూ విధించారు. అడుగడుక్కీ పోలీసులు పహారా కాస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది నగరం మొత్తాన్ని శుద్ధి చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు పట్టణం క్వారంటైన్‌లో ఉన్నట్టే ఉంది. గత నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన నాటి నుంచి గుంటూరులో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అయినప్పటికీ అక్కడ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటి [&hellip;]</p>

ఆ 9 మంది 53 మందికి అంటించారు
X

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాను కరోనా కేసులు వణికిస్తున్నాయి. గుంటూరు పట్టణంతో పాటు రూరల్‌లో కూడా పోలీసులు పూర్తి స్థాయి కర్ఫ్కూ విధించారు. అడుగడుక్కీ పోలీసులు పహారా కాస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది నగరం మొత్తాన్ని శుద్ధి చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గుంటూరు పట్టణం క్వారంటైన్‌లో ఉన్నట్టే ఉంది.

గత నెల 22న ప్రధాని నరేంద్ర మోదీ జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన నాటి నుంచి గుంటూరులో కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అయినప్పటికీ అక్కడ కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 56 కేసుల నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కరోనా వ్యాధి వ్యాప్తికి కారణాలపై ఆరాతీయడం మొదలు పెట్టారు. గుంటూరులో కరోనా ప్రబలడానికి కారణం ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని తబ్లిఘీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 9 మంది అని నిర్థారించారు.

గుంటూరు నగరంలో ఒక్క కరోనా పాజిటివ్ వ్యక్తికి తప్ప… మిగిలిన వారందరికీ వారి ద్వారానే సోకిందని అంచనాకి వచ్చారు. ఈ 9 మంది ద్వారా 53 మందికి కరోనా సోకిందని పోలీసులు గుర్తించారు. నిన్న పాజిటివ్‌గా తేలిన 17 కేసుల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు 10 మంది బాధితులని పోలీసులు చెబుతున్నారు. అందులో 6,7,8 ఏళ్ల చిన్నారులు కూడా ఉన్నారని వారు చెబుతున్నారు. వీరంతా ఆనందబజార్, కుమ్మరిబజార్, సంగడిగుంట ప్రాంతాల్లోని వారేనని పోలీసులు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. నిన్న నమోదైన కేసుల్లో 3 కేసులకు ఢిల్లీతో కానీ, విదేశాలతో కానీ ఎలాంటి సంబంధం లేదు.

అయితే ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి ఇళ్లకు సమీపంలో వీరి ఇళ్లు ఉన్నాయి. వారి ఇళ్లకు వచ్చి కూర్చోవడం, వారితో సన్నిహితంగా మాట్లాడడం, ఉండడం వల్ల కరోనా వారికి సోకిందని వారు తెలిపారు. దీంతో కరోనా పట్ల మరింత భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పుడా ప్రాంతాలు రెడ్ జోన్‌లో ఉన్నాయి. అక్కడ పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలవుతోంది. ఆ ప్రాంతాన్ని పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధీనంలోకి తీసుకున్నారు.

Tags: corona virus, covid-19, guntur, Andhra Pradesh, Corona positive cases

Next Story