- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 రోజులుగా ZOO బంద్.. 9 సింహాలకు కరోనా.. ఆడ సింహం మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు మనుషులను టార్గెట్ చేసిన కరోనా మహమ్మారి ఇపుడు జంతువులను కూడా వదలడం లేదు. తాజాగా ఓ ‘జూ’లోని సింహాలు కరోనా బారిన పడ్డాయి. అందులో మొత్తం 11 సింహాలు ఉండగా తొమ్మిది మృగాలకు కరోనా నిర్దారణ అయ్యింది. ‘నీలా’ అనే తొమ్మిదేండ్ల ఆడ సింహం కరోనా కాటుకు ప్రాణాలు వదిలింది. ఈ ఘటన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారి ధాటికి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న విషయం తెలిసిందే. ఇన్నిరోజులు మనుషులను టార్గెట్ చేసిన కరోనా మహమ్మారి ఇపుడు జంతువులను కూడా వదలడం లేదు. తాజాగా ఓ ‘జూ’లోని సింహాలు కరోనా బారిన పడ్డాయి. అందులో మొత్తం 11 సింహాలు ఉండగా తొమ్మిది మృగాలకు కరోనా నిర్దారణ అయ్యింది. ‘నీలా’ అనే తొమ్మిదేండ్ల ఆడ సింహం కరోనా కాటుకు ప్రాణాలు వదిలింది.
ఈ ఘటన తమిళనాడులోని వండలూర్ అరిగ్నార్ అన్నా జూ లో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. అసలు ట్విస్ట్ ఎంటంటే ఈ ‘జూ’ గత నెల రోజులుగా మూసే ఉంది. తమిళనాడులో కరోనా కేసులు వ్యాప్తి చెందుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జూ ను నెలరోజులుగా మూసి ఉంచారు. సందర్శకుల తాకిడి లేకుండా సింహాలకు కరోనా ఎలా సోకిందనే విషయంపై జూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
Next Story






