క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రోమాలు నిక్కబొడిచేలా ‘83’ 

by  |
83
X

దిశ, సినిమా : భార‌త క్రికెట్ చ‌రిత్రలో ‘1983’ సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సంవత్సరమని తెలిసిందే. కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు తొలిసారి వరల్డ్ కప్ సాధించి చరిత్ర సృష్టించింది. కాగా ఈ టోర్నీలో జట్టును నడిపించిన కెప్టెన్ కపిల్ దేవ్ లైఫ్ స్టోరీతో పాటు ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ జర్నీ ఆధారంగా ‘83’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ టైటిల్ రోల్‌ పోషించిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది.

‘అండర్‌ డాగ్స్‌గా బరిలోకి దిగి, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అద్భుతమైన కథ’ అంటూ రణ్‌వీర్‌ సింగ్‌ చిత్ర ట్రైలర్‌ను సోషల్‌ మీడియాలో షేర్ చేశారు. 1983 వరల్డ్ కప్‌‌లో ఇండియన్ టీమ్ ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలతో పాటు వైఫల్యాల నుంచి పుంజుకొని తొలి ప్రపంచ కప్‌ గెలుచుకున్న క్షణం వరకు గల సన్నివేశాలను ఇందులో చూడవచ్చు.

3 నిమిషాలకు పైగాఉన్న ట్రైలర్‌తో ప్రేక్షకులను 1983 పీరియడ్‌కు తీసుకెళ్లిన కబీర్ ఖాన్.. ఫైనల్ మ్యాచ్‌ సన్నివేశాలను రోమాలు నిక్కపొడిచే చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ఎట్టకేలకు డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అంతేకాదు 3డీ వెర్షన్‌లోనూ విడుదలవుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.



Next Story

Most Viewed