ఉత్కంఠ రేపుతున్న ‘83’ మూవీ టీజర్..

by  |
Ranveer singh
X

దిశ, సినిమా: 1983 క్రికెట్ వరల్డ్‌ కప్‌ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో రణ్‌వీర్‌ సింగ్ ప్రాధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘83’. ఈ సినిమాలో ఇండియన్ క్రికెటర్ కపిల్ దేవ్ పాత్రలో రణ్‌వీర్ కనిపించనున్నాడు. ఈ మూవీ టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో దీపికా పదుకునే, జీవా, తాహీర్‌ రాజ్‌ భాసీన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక టీజర్ విషయానికి వస్తే.. 1983లో ఇండియా వరల్డ్ కప్ గెలిచిన అంశాల ఆధారంగా దర్శకుడు కబీర్ ఖాన్ సినిమాను తెరకెక్కించాడు.

లండన్‌ లార్డ్ క్రికెట్‌ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ను తలపించేలా టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో వెస్టిండీస్ బ్యాటర్ చివరి బంతిని గాల్లోకి కొట్టగా.. ఆ క్యాచ్ పడితే ఫలితం తేలిపోతుందనే ఉత్కంఠతో టీజర్‌ ముగిసింది. ఈ మేరకు టీజర్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక ఈ సినిమాను ఫాంటమ్‌ ఫిలిమ్స్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, 83 ఫిలిమ్‌ లిమిటెడ్‌ నిర్మించగా.. ఈ యేడాది డిసెంబర్‌ 24 దేశ వ్యాప్తంగా విడుదల కానుంది.


Next Story