'83' – క్రికెట్ చారిత్రాత్మక ఘట్టం పోస్టర్

by  |
83 – క్రికెట్ చారిత్రాత్మక ఘట్టం పోస్టర్
X

’83’ సినిమా – భారతీయ క్రికెట్ చరిత్రకు సాక్ష్యంగా నిలవనుంది. క్రికెటర్ కపిల్ దేవ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భారత్ తొలిసారి ప్రపంచ కప్ సాధించిన ఘట్టాన్ని రీక్రియేట్ చేయబోతున్నారు. రణ్‌వీర్ సింగ్ కపిల్ దేవ్ పాత్రలో కనిపిస్తుండగా.. దీపికా పడుకోన్ సతీమణిగా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై ప్రేక్షకాదరణ పొందగా… మరో పోస్టర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. 1983లో ఇండియన్ కెప్టెన్‌గా వరల్డ్ కప్‌ లిఫ్ట్ చేస్తున్న కపిల్‌గా రణ్‌వీర్ లుక్ అదిరిపోయింది. ఈ ఐకానిక్ మూమెంట్‌ను స్క్రీన్‌పై చూసేందుకు అభిమానులంతా వెయిట్ చేస్తుండగా… కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న 83 ట్రైలర్ మార్చి 11న రిలీజ్ కానున్నట్లు ప్రకటించింది టీం. ఏప్రిల్ 10న సినిమాను విడుదల చేయనుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా హిట్ పర్‌ఫెక్ట్ అయితే… రణ్‌వీర్ ఈ జనరేషన్ సూపర్ స్టార్‌గా సర్టిఫై అయినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.

Tags: 83, Kapil Dev Biopic, Ranveer Singh, Deepika Padukone, Kabeer Khan

Next Story

Most Viewed