‘పోర్షె’ పోటుగాడు ఈ తాత

by  |
‘పోర్షె’ పోటుగాడు ఈ తాత
X

దిశ, వెబ్‌డెస్క్: అతడి వయసు 80 కావచ్చు. కానీ, మనసు పాతికేళ్ల కుర్రాడిలా పరిగెడుతోంది.‘80’ జస్ట్ ఓ నెంబర్‌ అనే ఒట్టోకార్.జె అనే వ్యక్తి తన ఎనిమిది పదుల జీవితంలో ఎనభై ‘పోర్షె’ కార్లు కొని సెంచరీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. క్లాసీ బీస్ట్ ‘పోర్షె’ కారుకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఒట్టోకార్ మాత్రం ఆ కార్లకు వేరే లెవల్ ఫ్యాన్.

అమ్మాయిలతో ప్రేమలో పడటం కామన్. కానీ ‘పోర్షె’తో లవ్‌లో మునిగితేలడం ఒట్టేకార్‌కే సొంతం. ఓ యాభై ఏళ్ల క్రితం ‘పోర్షె’ కారును చూసిన తొలి చూపులోనే, అది కొనాలని డిసైడ్ అయిపోయిన ఈయన అందుకోసం డబ్బులు కూడబెట్టడం ఆ రోజు నుంచే స్టార్ట్ చేశాడు. అలా కొన్నేళ్ల త‌ర్వాత 911 ఈ పోర్షె కారును కొన్నాడు. అరుదైన 8 సిలిండర్ల ఇంజిన్ పొర్షె కారు 910తో పాటు, 917, 904, 956 లాంటి టాప్ మోడ‌ల్స్ సహా మొత్తంగా 80 పొర్షె కార్లను ఆయన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయ‌న దగ్గర 38 పోర్షె కార్లు ఉన్నాయి. రోజుకో కారులో రైడ్‌కు వెళతానని, వీకెండ్స్‌లో అయితే రెండు కార్లు తీసుకెళ్తాన‌ని ఒటోకార్ సూపర్ స్మైలింగ్‌తో, ఒకింత గర్వంతో చెబుతున్నాడు.

తను అపూరూపంగా చూసుకునే ఈ పొర్షె కార్ల కోసం ప్రత్యేకంగా ఓ బిల్డింగ్ నిర్మించడంతో పాటు, దానికి ‘లివింగ్ రూమ్’ అని పేరు పెట్టుకున్నాడు. తన కలెక్షన్స్ చూడ్డానికి ఇక్కడకు ఎంతోమంది సందర్శకులు వస్తుంటారు. అందులోనే టాయ్ షాప్, యాంటిక్ స్టోర్‌ల‌తో పాటు, సినిమా స్క్రీన్ కూడా ఉండ‌టం విశేషం. ఎన్నో కార్ రేసెస్‌‌కు సంబంధించిన రేర్ ఫొటోగ్రాఫ్స్, పెయింటింగ్స్‌తో పాటు, ట్రోఫీస్, మెమొంటోస్ కూడా లివింగ్‌రూమ్‌లో చూడొచ్చు. ‘మనం లేకపోతే కార్లు.. కార్లలానే ఉండిపోతాయి. ఈ బ్యూటీ మెషీన్లకు హ్యుమన్ టచ్ ఇచ్చినప్పుడే వాటికి వ్యాల్యు. ఒక్కమాటలో చెప్పాలంటే.. జీవం లేని కార్లకు మనమే ఊపిరిపోసి.. ప్రాణాలిస్తుంటాం’ అని ఒట్టేకార్ అంటున్నాడు. ఆయన అన్నమాటల్లో వాస్తవం లేకపోలేదు.



Next Story

Most Viewed