- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిన్న8, నేడు 8..ఇది జనగామలో కరోనా పరిస్థితి
by B.Srinivas |
<p>దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఎనిమిది కేసులు నమోదవ్వగా, శనివారం కూడా మరో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యినట్టు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణం యజమానితో ప్రారంభమైన ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. వరుసగా రెండు రోజులు ఒకే సంఖ్యతో కేసులు నమోదు కావడంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, జనగామలో ఇప్పటి వరకు 35 పాజిటివ్ కేసులు […]</p>

X
దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా విజృంభణ రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఎనిమిది కేసులు నమోదవ్వగా, శనివారం కూడా మరో ఎనిమిది కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యినట్టు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ దుకాణం యజమానితో ప్రారంభమైన ఈ వైరస్ క్రమంగా విస్తరిస్తోంది. వరుసగా రెండు రోజులు ఒకే సంఖ్యతో కేసులు నమోదు కావడంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, జనగామలో ఇప్పటి వరకు 35 పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 10 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒకరు మాత్రం ఆ మహమ్మారికి బలయ్యారు.
Next Story






