తెలంగాణలో ఒకేరోజు 8 కేసులు నమోదు

by Shyam |   (  Updated:2020-03-18 21:14:57  IST  )

<p>తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన వారిలో ఏడుగురు ఇండోనేషియా పౌరులు కాగా, మరొకరు స్కాట్లాండ్ నుంచి వచ్చిన మేడ్చల్ జిల్లా వాసి. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది. 12 మంది బాధితులు ఆసుపత్రుల్లో చిక్సిత పొందుతుండగా, ఒకరికి వ్యాధి నయం కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇటీవల ఇండోనేషియాకు చెందిన 10 పౌరులు కరీంనగర్ కు వచ్చారు. [&hellip;]</p>

తెలంగాణలో ఒకేరోజు 8 కేసులు నమోదు
X

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం ఒక్కరోజే ఏకంగా 8 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకిన వారిలో ఏడుగురు ఇండోనేషియా పౌరులు కాగా, మరొకరు స్కాట్లాండ్ నుంచి వచ్చిన మేడ్చల్ జిల్లా వాసి. దీంతో రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 13కు చేరింది. 12 మంది బాధితులు ఆసుపత్రుల్లో చిక్సిత పొందుతుండగా, ఒకరికి వ్యాధి నయం కావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఇటీవల ఇండోనేషియాకు చెందిన 10 పౌరులు కరీంనగర్ కు వచ్చారు. వీరిలో ఒకరి వ్యాధి నిర్ధారణ కావడంతో.. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించగ్గా ఏడుగురికి వైరస్ సోకడంతో తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేగింది. ప్రస్తుతం వీరు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, కరోనాపై సీఎం కేసీఆర్ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష జరపనున్నారు.

Tags: corona, karimnagar, 8 positive cases, ts news

Next Story