- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆడుకుంటున్న చిన్నారిని ఎత్తుకెళ్లి..
<p>దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి చేతిలో మరో చిన్నారి బలైంది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు.ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.ఈ ఘటన అనంతపురం జిల్లాలోని పుట్లూరు పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే..జిల్లాలోని పుట్లూరుకు చెందిన ఓ చిన్నారి(ఏడేండ్లు) ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన రామాంజనేయులు ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి చేతిలో మరో చిన్నారి బలైంది. అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు.ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు.ఈ ఘటన అనంతపురం జిల్లాలోని పుట్లూరు పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే..జిల్లాలోని పుట్లూరుకు చెందిన ఓ చిన్నారి(ఏడేండ్లు) ఇంటి ముందు ఆడుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన రామాంజనేయులు ఈ క్రమంలోనే బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై లైంగికదాడికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయగా భయపడి వదిలివేసి పారిపోయాడు. ఆ విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో ఆమె పుట్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.






