71 ఏళ్ల వయసు.. పవర్ లిఫ్టింగ్‌లో రికార్డులు

by Shyam |   (  Updated:2024-06-02 09:18:13  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆరుపదుల వయసులో సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టిన గ్రాండ్ ఫాదర్స్.. సెంచరీ చేరువలో మోడల్‌గా రాణిస్తున్న తాతలు, బామ్మలు.. ఏడేళ్లకే వెయిట్ లిఫ్టింగ్‌‌‌లో అదరగొట్టిన చిన్నారి.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘వయసు’ జస్ట్ ఓ నెంబర్ మాత్రమే అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. కాగా అమెరికాకు చెందిన 71 ఏళ్ల రూడీ కాండ్లబ్ కూడా అదే కోవకు చెందుతాడు. డెబ్బై సంవత్సరాల వయసులో.. యువకులకు కూడా సాధ్యం కాని ఫీట్స్ చేస్తూ ‘వెయిట్ లిఫ్టింగ్’లో […]</p>

71 ఏళ్ల వయసు.. పవర్ లిఫ్టింగ్‌లో రికార్డులు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆరుపదుల వయసులో సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టిన గ్రాండ్ ఫాదర్స్.. సెంచరీ చేరువలో మోడల్‌గా రాణిస్తున్న తాతలు, బామ్మలు.. ఏడేళ్లకే వెయిట్ లిఫ్టింగ్‌‌‌లో అదరగొట్టిన చిన్నారి.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘వయసు’ జస్ట్ ఓ నెంబర్ మాత్రమే అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. కాగా అమెరికాకు చెందిన 71 ఏళ్ల రూడీ కాండ్లబ్ కూడా అదే కోవకు చెందుతాడు. డెబ్బై సంవత్సరాల వయసులో.. యువకులకు కూడా సాధ్యం కాని ఫీట్స్ చేస్తూ ‘వెయిట్ లిఫ్టింగ్’లో రికార్డులు బద్దలుకొడుతున్నాడు. వందల కిలోలను ఈజీగా ఎత్తేస్తూ.. యూత్‌కు సవాల్ విసురుతున్నాడు. వెయిట్ లిఫ్టింగ్‌లో నాలుగు ప్రపంచరికార్డులను నెలకొల్పిన ఆ ఏడుపదుల బాడీ బిల్డర్ విశేషాలు మీకోసం..

అందరూ 60 ఏళ్లు దగ్గరపడుతుంటే రిటైర్‌మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. కానీ రూడీ మాత్రం రిటైర్ అయ్యే ఏజ్‌లో బాడీ బిల్డింగ్ చేయాలనుకున్నాడు. ఈ వయసులో అదేం కోరిక! అని అనుకోవచ్చు కానీ మనిషి తలచుకుంటే ఏదైనా సాధ్యమే! ఎస్.. రూడీ విషయంలోనూ అది నిరూపితమైంది. రూడీ 55 ఏళ్ల పడిలోకి చేరుకున్నాక, తన ఫిట్‌నెస్ జర్నీ మొదలుపెట్టాడు. తన బలాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ.. ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్‌గా మారడానికి ఎంతో కష్టపడ్డాడు. చివరకు అనుకున్నది సాధించిన రూడీ.. రికార్డులు కొల్లగొడుతూ, టైటిల్స్ వేట కొనసాగిస్తున్నాడు. తాజాగా శాన్ డియాగోలో జరిగిన యూఎస్‌పీఏ నార్త్ అమెరికన్ చాంపియన్‌షిప్‌-2020లో పాల్గొని, ఒకేరోజు ఏకంగా నాలుగు ప్రపంచ రికార్డులను నెలకొల్పి ఔరా అనిపించాడు. స్నాచ్‌ విభాగంలో 234 కిలోలు, స్క్వాట్‌లో 195 కిలోలు, బెంచ్ ప్రెస్సెడ్‌లో 303 కిలోల బరువులను లిఫ్ట్ చేసి రికార్డు సృష్టించగా, ఒకేరోజు 567 కిలోలు లిఫ్ట్ చేసి నాలుగో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

రూడీ కాండ్లబ్.. ఈ సందర్భంగా తన కోచ్‌లతో పాటు ట్రైనింగ్ పార్టనర్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశాడు. కాగా రూడీ అచీవ్‌మెంట్‌ను అభినందిస్తూ నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ‘రూడీ నువ్వే మా హీరో.. మీ డెడికేషన్, హార్డ్ వర్క్‌కు హ్యాట్సాఫ్!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story