అవగాహన లేకుండా ఆయన రాజకీయాలు చేస్తున్నారు….

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-11-01 02:53:20  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ను 71 శాతం పూర్తి చేశామని ఆయన తెలిపారు. చాలా బాగా పనిచేశారని ఆ రోజు నితిన్ గడ్కరీ అభినందించారని ఆయన తెలిపారు. 2019లో సాంకేతిక సలహా కమిటీ రూ. 55వేల కోట్ల అంచనాలను ఆమోదిచందని ఆయన అన్నారు. 2013 భూ సేకరణ వల్ల పరిహారం, ప్యాకేజీ 70శాతం పెరిగిందని ఆయన అన్నారు. [&hellip;]</p>

అవగాహన లేకుండా ఆయన రాజకీయాలు చేస్తున్నారు….
X

దిశ, వెబ్ డెస్క్:
పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి జీవనాడి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ ను 71 శాతం పూర్తి చేశామని ఆయన తెలిపారు. చాలా బాగా పనిచేశారని ఆ రోజు నితిన్ గడ్కరీ అభినందించారని ఆయన తెలిపారు. 2019లో సాంకేతిక సలహా కమిటీ రూ. 55వేల కోట్ల అంచనాలను ఆమోదిచందని ఆయన అన్నారు. 2013 భూ సేకరణ వల్ల పరిహారం, ప్యాకేజీ 70శాతం పెరిగిందని ఆయన అన్నారు. 2014లో తమ మాటమేరకు ఆర్డినెన్స్ ఇచ్చి ముంపు మండలాలను కలిపారని తెలిపారు. పోలవరం పై అవగాహన లేకుండా సీఎం జగన్ రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. అవగాహన లేకుండా అన్యాయం చేయొద్దని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక వైఖరిని ఖండిస్తున్నానని ఆయన తెలిపారు.

Next Story