- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాకిస్థాన్లో పేలుడు.. ఏడుగురు మృతి
<p>దిశ, వెబ్డెస్క్ : పాకిస్థాన్‌లోని పేషావర్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు. 20 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పెషావర్ నగరంలోని డైరెక్టర్ కాలనీలోని ఓ శిక్షణ స్కూల్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. స్కూల్‌లో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : పాకిస్థాన్‌లోని పేషావర్‌లో జరిగిన పేలుడు ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని లేడీ రీడింగ్ ఆస్పత్రికి తరలించారు. 20 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పెషావర్ నగరంలోని డైరెక్టర్ కాలనీలోని ఓ శిక్షణ స్కూల్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ఘటనకు సంబంధించి విచారణ చేపట్టనున్నట్లు పేషావర్ పోలీసు ఆఫీసర్ మన్సూర్ అమన్ తెలిపారు. స్కూల్‌లో ఖురాన్ పాఠాలు బోధిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు వెల్లడించారు. ఐఈడీతో పేలుడుకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
Next Story






