జియాగూడలో ఓట్లు గల్లంతు

by Vadlamudi Anukaran |

<p>దిశ ప్రతినిధి, హైదరాబాద్: జియాగూడలోని 38వ పోలింగ్ బూత్‎లో సుమారు ఆరు వందల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ బూత్‎లో 914 ఓట్లకు గాను 657 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఓటర్ లిస్ట్‎లో డిలీటెడ్ అని చూపిస్తుండడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు వేశామని.. ఇప్పుడు ఎలా తొలగిస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓటర్ ఐడీ, ఓటర్ స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేర్లు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. భార్యకు ఓటు [&hellip;]</p>

జియాగూడలో ఓట్లు గల్లంతు
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: జియాగూడలోని 38వ పోలింగ్ బూత్‎లో సుమారు ఆరు వందల ఓట్లు గల్లంతయ్యాయి. ఈ బూత్‎లో 914 ఓట్లకు గాను 657 ఓట్లు గల్లంతు అయ్యాయి. ఓటర్ లిస్ట్‎లో డిలీటెడ్ అని చూపిస్తుండడంతో ఓటర్లు ఆందోళనకు దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓటు వేశామని.. ఇప్పుడు ఎలా తొలగిస్తారని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. ఓటర్ ఐడీ, ఓటర్ స్లిప్పులు ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేర్లు తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు.

భార్యకు ఓటు ఉంటే భర్త పేరు తొలగింపు..

జియాగూడ పోలింగ్ బూత్‎లో చాలా కుటుంబాలలో భార్యకు ఓటు ఉంటే భర్త పేరు తొలగించడం, భర్త పేరు ఉంటే భార్య పేరు తొలగించడం వంటివి చోటు చేసుకున్నాయి. 18 ఓట్లు ఉన్న ఓ కుటుంబంలో కేవలం ఐదు ఓట్లు మాత్రమే ఓటర్ లిస్ట్ లో ఉంచి మిగిలినవి తొలగించడం గమనార్హం. చనిపోయిన వారి పేర్లు ఓటర్ లిస్టు లో ఉండగా.. ఉన్నవారిని చనిపోయారంటూ చూపిస్తూ ఓట్లు తొలగించారని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. 30 ఏళ్ల నుండి ఓటు వేస్తున్నాను, ఇప్పుడు నా పేరు తొలగించారు, నేను బతికి ఉన్నట్లా? చనిపోయినట్లా ? అని ఓ వృద్ధుడు ప్రశ్నించారు.

Next Story