హుజురాబాద్‌ బై పోల్‌కు 61 నామినేషన్లు..

by  |
huzurabad
X

దిశ, హుజురాబాద్ రూరల్ : హుజురాబాద్ ఉపఎన్నికల్లో నామినేషన్లు పెద్ద ఎత్తున దాఖలయ్యాయి. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చివరి రోజైన శుక్రవారం వరకు 61 మంది అభ్యర్థులు 92 సెట్లు దాఖలు చేశారు. ఈ రోజు 42 మంది నామినేషన్లు వేశారు. అయితే, చివరి రోజున నామినేషన్లు వేసేందుకు పెద్ద ఎత్తున అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసుకు చేరుకోవడంతో స్వీకరణ ప్రక్రియ రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది.

ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయాలని భావించారు. అయితే, వారికి ప్రతిపాదించేందుకు హుజురాబాద్ ఓటర్లు ముందుకు రాకపోవడంతో తక్కువ మందితోనే సరిపెట్టాల్సి వచ్చింది. 15 మంది వరకు ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది.


Next Story

Most Viewed