మేఘాలయ అడవుల్లో దారుణం.. ఆరుగురి మృతి

90

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో 150 అడుగుల ఎత్తు మీద నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా అస్సాంకు చెందిన వలస కార్మికులుగా గుర్తించారు.

మేఘాలయలోని ఎత్తైన కొండల్లో అక్రమంగా మైనింగ్ జరుపుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆ రాష్ట్ర మంత్రి ఒకరు శుక్రవారం వెల్లడించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..