- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిప్టులో ఇరుక్కొని బాలుడు మృతి
<p>దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావిలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. షాహుర్ నగర్‌లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్‌మెంట్‌లో ఉండే మహ్మద్ హోజైఫ్ షేక్ అనే బాలుడు.. స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్‌కు వెళ్లడం కోసం లిఫ్ట్ ఎక్కాడు. అయితే లిఫ్ట్ కింది ఫ్లోర్ రాగానే డోరు తెరుచుకుంది. హూజైఫ్ షేక్ తప్ప మిగతా పిల్లలు దిగిపోయారు. చివరగా లిఫ్టు నుంచి బయటికి […]</p>

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ధారావిలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితులతో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే.. షాహుర్ నగర్‌లోని కోజీ షెల్టర్ అనే అపార్ట్‌మెంట్‌లో ఉండే మహ్మద్ హోజైఫ్ షేక్ అనే బాలుడు.. స్నేహితులతో కలిసి కింది ఫ్లోర్‌కు వెళ్లడం కోసం లిఫ్ట్ ఎక్కాడు.
అయితే లిఫ్ట్ కింది ఫ్లోర్ రాగానే డోరు తెరుచుకుంది. హూజైఫ్ షేక్ తప్ప మిగతా పిల్లలు దిగిపోయారు. చివరగా లిఫ్టు నుంచి బయటికి వచ్చిన షేక్.. గ్రిల్స్ వేస్తుండగా వెనుక ఉన్న డోర్ మూసుకుపోయింది. దీంతో షేక్ డోర్‌కు, గ్రిల్స్‌కు మధ్య ఇరుక్కుపోయాడు. ఈలోగా మరొకరు లిఫ్ట్ బటన్ నొక్కడంతో కిందకు కదిలింది. రెండు డోర్ల మధ్య ఉన్న షేక్ నలిగి ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి.







