మహారాష్ట్రలో ట్రక్ బీభత్సం.. ఐదుగురు మృతి

72
truck hit auto

దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్రలో ట్రక్ బీభత్సం సృష్టించింది. మృత్యువు రూపంలో వచ్చిన భారీ ట్రక్ ఐదుగురు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని బీద్-పర్లీ హైవేపై సోమవారం తెల్లవారు జామున వెలుగుచూసింది. వేగంగా వచ్చిన వాహనం తొలుత ఆటోను ఢీకొట్టగా, ఆ తర్వాత బైక్, మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8మందికి తీవ్రగాయాలయ్యాయి.

మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..