దోస్త్​​లో 57,695 మందికి సీట్లు

18

దిశ, తెలంగాణ బ్యూరో: దోస్త్​ మూడో ఫేజ్​లో 57,695 మందికి సీట్లను కేటాయించినట్టు దోస్త్​ కన్వీనర్​ లింబాద్రి తెలిపారు. 1,2 ఫేజ్​ల్లో నుంచి నచ్చిన కాలేజీలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు 15,103 మందితో కలిపి 74,984 మంది విద్యార్థులు మూడో ఫేజ్​లో వెబ్​ ఆప్షన్లు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. ఈ నెల 15 నుంచి 26 వరకూ ప్రత్యేక పేజ్​ సీట్ల రిజిస్ట్రేషన్​కు అవకాశం కల్పించామన్నారు. స్పెషల్​ కేటగిరీలో అక్టోబర్​ 27వరకూ వెబ్​ ఆప్షన్లను ఇవ్వొచ్చని, 30న సీట్ల కేటాయింపులు చేస్తామన్నారు.