- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేట్ హోంలో 57 మంది బాలికలకు కరోనా, ఐదుగురికి గర్భం
<p>యూపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఓ స్టేట్ హోంలో అశ్రమం పొందుతున్న 57 మంది బాలికలు కరోనా బారిన పడ్డారు. అందులో ఐదుగురు గర్భం దాల్చినట్లు తేలడంతో రాజకీయంగా పెను దూమారం చెలరేగింది. ఈ ఘటనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి కాన్పూర్ ఎస్సెస్పీ దినేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాలికలు గర్భం రావడం, వీరిలో ఒకరికి హెచ్ఐవీ పాజిటివ్, మరొకరికి హెపటైటిస్-సి ఉన్నట్లు వస్తున్న వార్తలపై […]</p>

యూపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఓ స్టేట్ హోంలో అశ్రమం పొందుతున్న 57 మంది బాలికలు కరోనా బారిన పడ్డారు. అందులో ఐదుగురు గర్భం దాల్చినట్లు తేలడంతో రాజకీయంగా పెను దూమారం చెలరేగింది. ఈ ఘటనపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి కాన్పూర్ ఎస్సెస్పీ దినేశ్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బాలికలు గర్భం రావడం, వీరిలో ఒకరికి హెచ్ఐవీ పాజిటివ్, మరొకరికి హెపటైటిస్-సి ఉన్నట్లు వస్తున్న వార్తలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై ఆ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు పూనం కపూర్ స్పందించారు. స్టేట్ హోంలోకి వచ్చిన తరువాత బాలికలు గర్భం దాల్చలేదని ఆమె స్పష్టం చేశారు. వారందరూ అప్పటికే లైంగిక దాడి బాధితులని ఆమె చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కాన్పూర్ కలెక్టర్ బ్రహ్మదేవ్ కూడా ధృవీకరించారు. కరోనా సోకిన బాలికలను ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ తెలిపారు.






