- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి..బాలికలపై అఘాయిత్యం
by Shyam |
<p>దిశ, నిజామాబాద్: చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు బాలికలపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకం పేట్ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన నారాయణ (55) గత పదిహేను రోజులుగా ఎనిమిదేండ్ల వయస్సున్న ఇద్దరు మైనర్లకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి.. పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని బాలికలను బెదిరింపులకు గురిచేశాడు. ఈ […]</p>

X
దిశ, నిజామాబాద్: చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఇద్దరు బాలికలపై ఓ వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకం పేట్ గ్రామంలో ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకివెళితే.. గ్రామానికి చెందిన నారాయణ (55) గత పదిహేను రోజులుగా ఎనిమిదేండ్ల వయస్సున్న ఇద్దరు మైనర్లకు చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి.. పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. అంతేకాకుండా ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పవద్దని బాలికలను బెదిరింపులకు గురిచేశాడు. ఈ క్రమంలోనే బాలికలకు కడుపు నొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో గ్రామస్థులు నారాయణ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అనంతరం ఇద్దరు మైనర్లను వైద్యం కోసం ఎడపల్లి పోలీసులు బోధన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






