- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కశ్మీర్‌లో కొత్త రికార్డు.. ఒకేసారి 55 జంటలకు పెళ్లి!
<p>దిశ, వెబ్‌డెస్క్ : శ్రీనగర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కశ్మీర్ లోయలోని వివిధ జిల్లాలకు చెందిన 55 మందికి పైగా అణగారిన వర్గాలకు చెందిన జంటలు ఆదివారం పెళ్లి చేసుకున్నారు. కశ్మీర్‌లో ఇదే అతిపెద్ద కార్యక్రమం అని వేడుక నిర్వాహకులు జాఫ్రీ కౌన్సిల్ తెలిపారు. శ్రీనగర్‌లోని అమర్‌సింగ్ క్లబ్‌లో జరిగిన ఈ వేడుకను డజన్ల కొద్దీ ప్రజలు తిలకించారు. కౌన్సిల్ ఇంతకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించింది. అయితే ఈ సంవత్సరం 55 జంటలతో జరిగిన […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : శ్రీనగర్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో కశ్మీర్ లోయలోని వివిధ జిల్లాలకు చెందిన 55 మందికి పైగా అణగారిన వర్గాలకు చెందిన జంటలు ఆదివారం పెళ్లి చేసుకున్నారు. కశ్మీర్‌లో ఇదే అతిపెద్ద కార్యక్రమం అని వేడుక నిర్వాహకులు జాఫ్రీ కౌన్సిల్ తెలిపారు. శ్రీనగర్‌లోని అమర్‌సింగ్ క్లబ్‌లో జరిగిన ఈ వేడుకను డజన్ల కొద్దీ ప్రజలు తిలకించారు. కౌన్సిల్ ఇంతకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించింది. అయితే ఈ సంవత్సరం 55 జంటలతో జరిగిన ఈవెంట్ ఇప్పటివరకు జరిగిన వాటిల్లో అతిపెద్దదని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి వివాహాన్ని జంటలు చాలా సులభంగా చేసుకోవచ్చని జాఫ్రీ కౌన్సిల్ అధ్యక్షుడు హాజీ ముసాదిక్ హుస్సేన్ తెలిపారు.
జంటలు వారి వివరాలను సంస్థలో రిజిస్టర్ చేసుకున్నాకా “ఆ జంటలు సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారా కాదా అని చూసిన తర్వాతే ధృవీకరిస్తామని అతను చెప్పాడు. ఇలా అర్హులైన జంటలకు సంస్థనే వివాహానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రారంభిస్తుంది,” అన్నారాయన.






