గత 12 నెలల్లో 53 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు!

by  |
గత 12 నెలల్లో 53 శాతం పెరిగిన డిజిటల్ చెల్లింపులు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ గడిచిన ఏడాది కాలంలో డిజిటల్ లావాదేవీలు 53 శాతం పెరిగాయని ఆర్‌బీఐ పేమెంట్స్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ జనరల్ మేనేజర్ వాసుదేవన్ అన్నారు. విలువ పరంగా 28 శాతం పెరుగుదల నమోదైందని ఆయన తెలిపారు. పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న వాసుదేవన్.. సంఖ్యా పరంగా గత ఐదేళ్ల సగటు వృద్ధి రేటు 42 శాతంగా ఉంది.

ప్రస్తుతం రోజుకు సగటున 21.79 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ఆర్‌టీజీఎస్ విధానం అన్నిరోజులూ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకున్నాం. భారత్ బిల్ పేమెంట్, ఎన్ఏ సీహెచ్ లాంటి చెల్లింపు వ్యవస్థలు వారాంతాల్లో సైతం అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఈ చెల్లింపుల వ్యవస్థలో సెటిల్‌మెంట్ల సంఖ్య 200కి పెరిగింది. తద్వారా క్రెడిట్, సెటిల్‌మెంట్ రిస్కులు తగ్గాయని’ వాసుదేవన్ వివరించారు.


Next Story

Most Viewed