- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలికతో అసభ్య ప్రవర్తన.. కామాంధుడి అరెస్టు!
<p>దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 50 ఏండ్ల వయస్సున్న ఓ కామాంధుడు మనవరాలి వయస్సున్న బాలికతో తన కామ వాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఇంట్లో చెప్పడంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని స్థానిక భగత్ సింగ్ నగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సున్న బాలికపై ఇంటి ఓనర్ కన్నేశాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఊరు బయటకు తీసుకెళ్ళాడు. అనంతరం ఆమెతో […]</p>

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. 50 ఏండ్ల వయస్సున్న ఓ కామాంధుడు మనవరాలి వయస్సున్న బాలికతో తన కామ వాంఛ తీర్చుకోవాలని ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బాధితురాలు ఇంట్లో చెప్పడంతో కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన జిల్లాలోని స్థానిక భగత్ సింగ్ నగర్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సున్న బాలికపై ఇంటి ఓనర్ కన్నేశాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి ఊరు బయటకు తీసుకెళ్ళాడు. అనంతరం ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నారి ప్రైవేటు భాగాల్లో చేతులు వేస్తూ తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఇంటికొచ్చిన బాలికను ఎక్కడికి వెళ్లావని తల్లిదండ్రులు ప్రశ్నించగా అసలు విషయం చెప్పింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు టౌన్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఐ ఆంజనేయులు వెంటనే స్పందించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ ఇంటి యాజమాని నిజం అంగీకరించినట్లు సీఐ తెలిపారు.చిన్నారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన నిందితుడుకి చట్ట ప్రకారం శిక్ష పడేటట్లు చూస్తానని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. కాగా, నిందితుడు భగత్‌సింగ్ నగర్‌కు చెందిన చెరుకు వెంకటయ్య అని గుర్తించారు. అతను ఆర్టీసీలో పనిచేసే సమయంలో సర్వీస్ నుంచి తొలగించినట్లు సీఐ వెల్లడించారు.






