హాఫ్ సెంచరీ కొట్టాక.. ఆడపిల్లకు జన్మనిచ్చిన యాక్ట్రెస్

by  |
Naomi Campbell
X

దిశ, సినిమా: ఒక్కొక్కరి లైఫ్‌లో ఒక్కో దశలో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని విషయాల్లో ఆశలన్నీ వదిలేసుకున్నాక.. మ్యాజిక్ జరిగి అనుకున్నది నెరవేరుతుంది. బ్రిటిష్ మోడల్ నవోమి కాంప్‌బెల్ జీవితంలో కూడా ఇలాంటి మ్యాజిక్ చోటు చేసుకోవడంతో.. 50 ఏళ్ల వయస్సులో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఈ సందర్భంగా తను రాసిన నోట్, మరింత క్యూట్‌గా ఉందని చెప్తున్నారు. లేటెస్ట్ పోస్ట్‌లో బేబీ గర్ల్ చిట్టి కాళ్లను షేర్ చేసిన మోడల్.. ‘బ్యూటిఫుల్ లిటిల్ బ్లెసింగ్ నన్ను అమ్మగా ఎంచుకుంది. లైఫ్‌లో ఈ సున్నితమైన ఆత్మను కలిగి ఉండటం గౌరవంగా ఉంది. లైఫ్ లాంగ్ ఉండే ఈ బంధాన్ని వివరించేందుకు మాటలు సరిపోవడం లేదు. దీని కన్నా గొప్ప ప్రేమ మరొకటి లేదు’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది.



Next Story

Most Viewed