- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుట్కా ప్యాకెట్ల తరలింపు..5గురు అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, ఎల్బీనగర్: నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి డీసీఎం, కారుతో పాటు మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..ఎల్బీనగర్‌కు చెందిన జైని భరత్, మేడిశెట్టి నాగేష్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్‌ఖాన్, ఇమ్రాన్ అలీ, మహ్మద్ సోహెబ్ ఖాన్ కలిసి ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్, మల్లికార్జునహిల్స్, మల్లన్న టెంపుల్ వద్ద రూ.35 లక్షల విలువ […]</p>
దిశ, ఎల్బీనగర్: నిషేధిత గుట్కా ప్యాకెట్లను అక్రమంగా తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి డీసీఎం, కారుతో పాటు మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..ఎల్బీనగర్‌కు చెందిన జైని భరత్, మేడిశెట్టి నాగేష్, హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్‌ఖాన్, ఇమ్రాన్ అలీ, మహ్మద్ సోహెబ్ ఖాన్ కలిసి ఎల్బీనగర్ పరిధిలోని నాగోల్, మల్లికార్జునహిల్స్, మల్లన్న టెంపుల్ వద్ద రూ.35 లక్షల విలువ చేసే ఆర్.ఆర్ గుట్కా ప్యాకెట్లను అక్రమంగా డీసీఎం నెం ఏపీ29వీ 3260, కారు నెం టీఎస్07యుజీ5893లో తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితులతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు.
Next Story






