లక్కీ పర్సన్.. లంకె బిందెలో 5 కిలోల బంగారం..

236

దిశ, జనగామ : తెలంగాణలో లంకె బిందెలు దొరికాయి అని విని ఉంటారు కదా.. అలాంటి ఘటనే తాజాగా జనగామ జిల్లాలో వెలుగు చూసింది. జనగామ మండలం పెంబర్తి గ్రామంలో 5 కిలోల బంగారం ఉన్న లంకె బిందె దొరికింది. వివరాల ప్రకారం.. పెంబర్తి గ్రామంలో నర్సింహా అనే వ్యక్తి నెలరోజుల క్రితం 11 ఎకరాల వెంచర్‌ను కొనుగోలు చేశారు. అనంతరం వెంచర్‌ను చదును చేస్తుండగా.. ఓ చోట లంకె బిందె బయటకు వచ్చింది. అందులో దాదాపు 5 కోలోల బంగారం ఉన్నట్టు నర్సింహా తెలిపారు. సమాచారం తెలసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..