- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాజూకు నడుము కోసం..
<p>శరీరబరువు అదుపులో ఉండాలంటే ఆహార నియమాలతో పాటు, అనేక కఠిన వ్యాయమాలు చేయాల్సిందే. వీటిలో ముఖ్యమైనది పొట్టదగ్గర పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం. అధికబరువుతో బాధపడేవారు ఈ కొవ్వును కరిగించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ముఖ్యంగా చాలా మంది మహిళలు ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోతుంటారు. అయితే, ఈ కొవ్వును తొలగించడం పెద్ద కష్టమేం కాదు. సులభమైన సీతాకోకచిలుక ఆసనం ద్వారా సులభంగా కరిగించుకోవచ్చు. ఈ ఆసనం ఎలా వేయాలంటే.. – ముందుగా సుఖాసనంలో […]</p>

X
శరీరబరువు అదుపులో ఉండాలంటే ఆహార నియమాలతో పాటు, అనేక కఠిన వ్యాయమాలు చేయాల్సిందే. వీటిలో ముఖ్యమైనది పొట్టదగ్గర పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం. అధికబరువుతో బాధపడేవారు ఈ కొవ్వును కరిగించుకోవడానికి అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఈ భాగంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల ముఖ్యంగా చాలా మంది మహిళలు ఆత్మన్యూనతాభావంతో కుమిలిపోతుంటారు. అయితే, ఈ కొవ్వును తొలగించడం పెద్ద కష్టమేం కాదు. సులభమైన సీతాకోకచిలుక ఆసనం ద్వారా సులభంగా కరిగించుకోవచ్చు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే..
– ముందుగా సుఖాసనంలో కూర్చోవాలి.
– అనంతరం రెండు పాదాలను ఎదురెదురుగా ఒకదానితో ఒకటి ఆనించుకుని, కాలి వేళ్లను పట్టుకోవాలి.
– తర్వాత మోకాళ్లను పైకి కిందకు కదుపుతూ ఉండాలి.
– ఇలా క్రమం తప్పకుండా రోజూ 20సార్లు ఈ ఆసనం చేస్తే, శరీరం చురుగ్గా మారుతుంది.
– పొట్ట, తొడల దగ్గరున్న కొవ్వు కరిగిపోతుంది. నడుము సన్నగా మారుతుంది.
ఆ ప్రదేశాల్లో నలుపు తగ్గాలంటే ఇలా చేయండి
Next Story






