- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కూతురు పెళ్లికోసం ప్రయాణం.. రోడ్డుమధ్యలో గేదె శవం.. అంతలోనే
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో సంతోషంగా బంధువులతో కలసి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం మాట్లాడుకుని తిరిగి వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ పెళ్లి వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం […]</p>

దిశ, వెబ్‌డెస్క్ : ఎంతో సంతోషంగా బంధువులతో కలసి పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పెళ్లి సంబంధం మాట్లాడుకుని తిరిగి వెళ్తున్న వారిని మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని తుర్లపాడు మండలం రోలుగుంపాడులోని ఎస్టీ కాలనీ వద్ద టాటా ఏస్ పెళ్లి వాహనం బోల్తా పడిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతిచెందారు. రోడ్డుపై చనిపోయిన గేదెపైకి దూసుకెళ్లిన టాటా ఏస్ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో వాహనంలో 16 మంది ప్రయాణం చేస్తుండగా.. అందులో 5గురు మృతి చెందగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.






