లేడీ గాగాకు దొరికిపోయిన కుక్కల కిడ్నాపర్స్

by  |
లేడీ గాగాకు దొరికిపోయిన కుక్కల కిడ్నాపర్స్
X

దిశ, సినిమా : అమెరికన్ సింగర్ అండ్ సాంగ్ రైటర్ లేడీ గాగా కుక్కలు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో తన పెట్ డాగ్స్‌ను వాకింగ్‌కు తీసుకెళ్లిన డాగ్ వాకర్‌ను షూట్ చేసిన దుండగులు, ఈ మేరకు కుక్కలను కిడ్నాప్ చేశారు. అయితే వాటిని రిటర్న్ చేస్తే ఐదు లక్షల డాలర్లు ఇస్తామని ప్రకటించడంతో రెండు రోజుల తర్వాత మెక్ బ్రైడ్‌ అనే మహిళ.. ఆ డాగ్స్‌ను లేడీ గాగాకు అప్పగించింది. దీంతో తనకు రివార్డ్ కూడా ఇచ్చారు.

కాగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న లాస్ ఏంజిల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్.. కుక్కలను అప్పగించిన మహిళకు కిడ్నాప్‌తో సంబంధం లేదనే భావించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు.. వీరిలో ఒకరి తండ్రికి ఆ మహిళతో సంబంధాలున్నాయని నిర్ధారించారు. కాగా ఈ ఐదుగురి (జేమ్స్ జాక్సన్(18), జాయ్‌లిన్ వైట్(19), లఫయెట్టె వాలే(27)లతో పాటు వైట్ తండ్రి హరోల్డ్ వైట్(40), మెక్ బ్రైడ్‌)ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.


Next Story