పార్టీలో మజా కోసం ఆ పని చేసిన యువకులు.. 42మంది చుట్టూ చేరి

by  |
పార్టీలో మజా కోసం ఆ పని చేసిన యువకులు.. 42మంది చుట్టూ చేరి
X

దిశ, వెబ్‌డెస్క్: అదొక ఫంక్షన్ హాల్.. అక్కడ ఒకతని బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి. అందరు ఎంచక్కా పార్టీని ఎంజాయ్ చేస్తూ కూర్చున్నారు. ఇంతలో నలుగురు యువకులకు బోర్ కొట్టింది. ఏదో ఒకటి చేద్దాం అని సరదాగా బొమ్మా బొరుసు ఆడడం ప్రారంభించారు. ఇంకేముందు ఆటలో మజా రావడంతో నలుగురు కాస్తా 10 మంది అయ్యారు.. ఆ పది మంది కాస్తా 42 మంది అయ్యారు. ఇక బెట్టింగ్ లే బెట్టింగ్ లు. బర్త్ డే పార్టీని పక్కన పెట్టి.. బెట్టింగ్ లో మునిగిపోయారు. కేవలం వంద, రెండొందలతో మొదలైన బెట్టింగ్ లక్షల్లోకి మారిపోయింది. ఇంతలో ట్విస్ట్ గా బెట్టింగ్ రాజాల విషయం తెలుసుకున్న పోలీసులు సడెన్ ఎంట్రీ ఇవ్వడంతో బెట్టింగ్ రాజాలకు షాక్ తగిలింది. ఈ ఘటన కుత్బుల్లాపూర్ మండలం జీడిమెట్ల పరిధి చింతల్‌లో ఆదివారం అర్ధరాత్రి వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే.. చింతల్‌లోని ఐడీపీఎల్‌లో ఉన్న ఎంపీఆర్ కన్వెన్షన్‌ హాల్‌లో శ్రీనాథ్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు అందరు విచ్చేసారు. ఇక అలా పార్టీ సాగుతుండగా బోర్ కొట్టిన గోపాల్, శ్రీనాథ్, సంతోష్, శ్రీనివాసులు అనే వ్యక్తులు సరదాగా రూ.1 నాణెం ఉపయోగించి బొమ్మాబొరుసు ఆడడం మొదలు పెట్టారు.

ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉందని చుట్టు పక్కల ఉన్నవారు కూడా వారి వద్ద గుమిగూడారు. వంద, వెయ్యి అంటూ బెట్టింగ్ కాయడం స్టార్ట్ చేశారు. అలా ఆ ఆటలో 42 మంది పాల్గొని పందాలు కాస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నిషేధిత బెట్టింగ్ జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు ఎంపీఆర్ ఫంక్షన్ హాల్‌ కి వచ్చి దాడి చేశారు. బెట్టింగ్ ఆడుతున్న 42 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.4.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.


Next Story