- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వారంటైన్‌లోని మహిళ పై అఘాయిత్యం..
<p>దిశ, వెబ్ డెస్క్: కరోనా కష్టకాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పన్వెల్ లో దారుణం చోటుచేసుకుంది. కరోనా రోగులు, లక్షణాలు ఉన్నవారిని అక్కడి క్వారంటైన్ సెంటర్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే 40ఏళ్ల మహిళ కూడా అక్కడ కరోనా పాజిటివ్‌తో చేరింది. అదను చూసిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని […]</p>

దిశ, వెబ్ డెస్క్: కరోనా కష్టకాలంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. క్వారంటైన్ సెంటర్లలో కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలోని పన్వెల్ లో దారుణం చోటుచేసుకుంది. కరోనా రోగులు, లక్షణాలు ఉన్నవారిని అక్కడి క్వారంటైన్ సెంటర్లో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలోనే 40ఏళ్ల మహిళ కూడా అక్కడ కరోనా పాజిటివ్‌తో చేరింది. అదను చూసిన ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన పై పన్వెల్ జోన్-2 ఏసీపీ రవీంద్ర గీతే మాట్లాడుతూ.. క్వారంటైన్ సెంటర్లో దాదాపు 400 మంది ఉన్నారని చెప్పారు. పాజిటివ్ తో చికిత్స పొందుతున్న మహిళ పై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని.. వెంటనే అతడిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్థానిక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.






