- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ, స్పోర్ట్స్: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2021 ప్రారంభానికి మరి కొన్ని రోజులే సమయం ఉన్న నేపథ్యంలో ముంబై జట్టులో కరోనా కలకలం సృష్టించింది. ముంబై జట్టులోని షామ్స్ ములాని, సాయిరాజ్ పాటిల్, సర్ఫరాజ్ ఖాన్, ప్రశాంత్ సోలంకి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ముంబై క్రికెట్ అసోసియేషన్ సెలెక్షన్ కమిటీ గత వారమే 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా అజింక్య రహానే, వైస్ కెప్టెన్‌గా పృథ్వీ షాలను నియమించారు. నవంబర్ 4న ముంబై జట్టు కర్ణాటకతో తలపడాల్సి ఉండగా.. జట్టులో నలుగురు కరోనా బారిన పడినట్లు తేలింది. దీంతో ఈ నలుగురు ఈ టోర్నీకి దూరమయ్యారు. వీరు లేకుండానే మిగతా జట్టు గౌహతీకి వెళ్లింది. వీరి స్థానంలో నలుగురిని ఎంపిక చేసి త్వరలోనే అక్కడకు పంపనున్నారు.
- Tags
- cricket
Next Story