- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులను పట్టుకునేందుకు గత కొద్ది రోజుల నుంచి అటవీ ప్రాంతంలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ బెటాలియన్ల జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తూ మొత్తం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సుక్మా జిల్లాలోని జాగురుగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు ఎదురెదురుగా తారసపడ్డారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో 4 […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులను పట్టుకునేందుకు గత కొద్ది రోజుల నుంచి అటవీ ప్రాంతంలో డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ బెటాలియన్ల జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తూ మొత్తం అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో సుక్మా జిల్లాలోని జాగురుగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలు ఎదురెదురుగా తారసపడ్డారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనా స్థలంలో 4 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని భద్రతా బలగాలు వెల్లడించాయి.
Next Story






