‘పద్మావత్’ చేసినందుకు గర్వపడుతున్నా: రణ్‌వీర్‌సింగ్

by  |
‘పద్మావత్’ చేసినందుకు గర్వపడుతున్నా: రణ్‌వీర్‌సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావత్’ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. బాలీవుడ్ దివా దీపికా పదుకునే పద్మావతిగా..ఎనర్జిటిక్ హీరో రణ్‌వీర్‌సింగ్ అల్లా ఉద్దీన్ ఖిల్జీగా నటించిన ఈ చిత్రం వివాదాలు ఎదుర్కొన్నా సరే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా, ఈ చిత్రం రిలీజై మూడేళ్లైన సందర్భంగా సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో పోస్ట్ చేశాడు రణ్‌వీర్. సినిమా సెట్‌లో అడుగుపెట్టిన నుంచి చిత్రీకరణ పూర్తయ్యే వరకు ‘పద్మావత్‌’తో ఉన్న తన అనుబంధాన్ని ఈ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

డైలాగ్ ప్రాక్టీస్, డైరెక్టర్ నుంచి సూచనలు, యూనిట్ సభ్యులతో కలిసి ఉన్న సందర్భాలను వీడియోలో పొందుపరిచిన రణ్‌వీర్.. సినిమా షూటింగ్ ఎండ్ అయ్యే రోజున ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఏడాది పాటు పద్మావత్ షూటింగ్‌కు హాజరైన తనను భరించినందుకు యూనిట్‌కు థాంక్స్ చెప్పాడు.‘పద్మావత్‌’ సినిమా కోసం పనిచేసినందుకు జీవితాంతం గర్వపడతానని పేర్కొన్నాడు. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్‌లో తనను భాగం చేసి.. మరపురాని అనుభవం ఇచ్చిన సంజయ్ లీలా భన్సాలీకి కృతజ్ఞతలు తెలిపాడు.



Next Story

Most Viewed