- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెన్షన్ టెన్షన్.. దావత్ తెచ్చిన కరోనా
<p>దిశ, బోధన్ : హైదరాబాద్ నుంచి స్నేహితుడు రాగానే సహాచర మిత్రులు కలిసి గట్టిగా మందు దావత్ చేసుకున్నారు. కానీ, అదే వారి కొంపముంచుతుందని పసిగట్టలేకపోయారు. దావత్ సమయంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ బరువు అనుకున్నారేమో.. వారు చేసిన ఆ చిన్న తప్పిదం వల్లే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, హైద్రాబాద్ […]</p>

దిశ, బోధన్ :
హైదరాబాద్ నుంచి స్నేహితుడు రాగానే సహాచర మిత్రులు కలిసి గట్టిగా మందు దావత్ చేసుకున్నారు. కానీ, అదే వారి కొంపముంచుతుందని పసిగట్టలేకపోయారు. దావత్ సమయంలో భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ బరువు అనుకున్నారేమో.. వారు చేసిన ఆ చిన్న తప్పిదం వల్లే ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు, హైద్రాబాద్ నుంచి వచ్చిన మిత్రుడితో కలిసి మందు దావత్ చేసుకున్నారు. స్నేహితుడికి కరోనా సోకిందనే విషయం తెలియక.. అతనితో కలిసి మిగత వారు అందులో పాల్గొన్నారు. పార్టీ మొత్తం అయిపోయాక మరుసటి రోజు నగరం నుంచి వచ్చిన మిత్రునికి పాజిటివ్ ఉందని తేలింది. ఈ క్రమంలోనే కొందరిలో లక్షణాలు ఉండగా వారు టెస్టులు చేయించుకున్నారు. అందులో ఈరోజు ఇద్దరికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. విషయం తెలియడంతో తోటివారు కూడా టెస్టులు చేయించుకుని, హోం క్వారంటైన్‌లో ఉండి ఫలితాల కోసం బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు.






