- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోలకు నగదు సప్లై..ముగ్గురి అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, ఖమ్మం : మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న ముగ్గురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన గురువారం మధ్యాహ్నం మండలంలోని నల్లబెల్లి వద్ద చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ కూడా ఉండటం గమనార్హం. […]</p>
దిశ, ఖమ్మం :
మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న ముగ్గురు వ్యక్తులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీసులు అరెస్టు చేశారు.ఈ ఘటన గురువారం మధ్యాహ్నం మండలంలోని నల్లబెల్లి వద్ద చోటుచేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఓ సివిల్ కాంట్రాక్టర్ నుంచి రూ.6లక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ కూడా ఉండటం గమనార్హం. ఆయనతో పాటు పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.నిందితుల నుంచి రూ.6లక్షలు, కారు, ద్విచక్రవాహనం, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Next Story






