- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా భయంతో సముద్రంలో 3,711 మంది..!
by B.Srinivas |
<p> కరోనా భయంతో సముద్రంలో ప్రయాణీకులు చిక్కుకుపోయిన ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. డైమండ్ ప్రిన్సెస్ అనే విహార నౌక 3,711 మంది ప్రయాణీకులను తీసుకుని విహారానికి బయల్దేరింది. జపాన్‌లోని యొకహామా నగరానికి చేరుకున్న ఈ నౌకలో 8 మంది తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ 8 మందికి జ్వరం తీవ్రంగా ఉందని తెలిపారు. దీంతో ఆ జ్వరాలు ఎలా వచ్చాయని వైద్యులు వారిని ప్రశ్నించగా, ప్రయాణీకుల్లో ఒక వ్యక్తి హాంగ్‌కాంగ్‌లో దిగి వ్యక్తిగత పనులు […]</p>

X
కరోనా భయంతో సముద్రంలో ప్రయాణీకులు చిక్కుకుపోయిన ఘటన జపాన్‌లో చోటుచేసుకుంది. డైమండ్ ప్రిన్సెస్ అనే విహార నౌక 3,711 మంది ప్రయాణీకులను తీసుకుని విహారానికి బయల్దేరింది. జపాన్‌లోని యొకహామా నగరానికి చేరుకున్న ఈ నౌకలో 8 మంది తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ 8 మందికి జ్వరం తీవ్రంగా ఉందని తెలిపారు. దీంతో ఆ జ్వరాలు ఎలా వచ్చాయని వైద్యులు వారిని ప్రశ్నించగా, ప్రయాణీకుల్లో ఒక వ్యక్తి హాంగ్‌కాంగ్‌లో దిగి వ్యక్తిగత పనులు చూసుకుని నౌక ఎక్కాడు. అనంతరం అతను అస్వస్థతకు గురికావడంతో అతని నుంచి వారికి సోకిందని తేలింది. దీంతో ఆ 8 మందికి వైద్య చికిత్స అందించారు. అనంతరం నౌకలో ఉన్న అందరికీ తమతమగదుల్లోనే ఉండాలని సూచించారు. యొకహామా తీరంలోనే ఆ నౌకను రెండు రోజులపాటు జపాన్‌లో నిలిపేయాలని అధికారులు ఆదేశించారు.
Next Story






